గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, డ్రైవర్ స్పాట్ డెడ్ (వీడియో)

80చూసినవారు
గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్‌వేపై నదియాడ్ సమీపంలో శనివారం అర్థరాత్రి అతివేగంగా వెళుతున్న యాసిడ్ ట్యాంకర్.. ఎదురుగా వచ్చిన ఆయిల్ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతిచెందగా, క్లీనర్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్