సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. మరీ అటువంటి కళ్లను కొన్ని అలవాట్లతో ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటివంటే.. 20-20-20 రూల్ పాటించాలని పేర్కొంటున్నారు. అంటే డిజిటల్ స్క్రీన్లకు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరం ఉండాలని చెబుతున్నారు. అలాగే విటమిన్ ఏ, సీ,ఈ లోపం లేకుండా సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలని వివరిస్తున్నారు.