అమెరికాలో నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ నుంచి ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అధ్యక్ష రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు జో బైడెన్ తన పదవీ కాలంలో ఇప్పటివరకు వెకేషన్ కోసం 532 రోజులు కేటాయించినట్లు రిపబ్లికన్ నేషనల్ కమిటీ తాజా విశ్లేషణలో పేర్కొంది. ఇది ఆయన పదవీ కాలంలో 40 శాతం కావడం గమనార్హం. కాగా, గత 16 రోజులుగా బైడెన్ బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు.