ఫుడ్‌ పాయిజన్‌ ఘటనల వెనక భారీ కుట్ర: మంత్రి సీతక్క(వీడియో)

80చూసినవారు
TG: వసతి గృహాల్లో తరచూ ఫుడ్‌ పాయిజనింగ్ ఘటనలు చోటు చేసుకోవడంపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనల వెనక ఓ భారీ కుట్ర కోణం ఉందని ఆరోపించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 'ఈ కుట్ర వెనక ఎవరున్నారు అనేది బయట పెడతాం. ఈ కుట్రలో అధికారులు ఎవరైనట్లు తేలితే వారి ఉద్యోగాలు తీసేస్తాం. ఇందులో రాజకీయ పార్టీ కుట్ర ఉందని మా అనుమానం. ఆధారాలతో బయటపెడతాం' అని చెప్పారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్