దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాల్లో 80,281.64 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీలు.. ఐటీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడితో భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. చివరికి 1190.34 పాయింట్ల నష్టంతో 79,043.74 వద్ద ముగిశాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల కోతపై నెలకొన్న అనిశ్చితి మార్కెట్ పతనానికి కారణమైంది. సెన్సెక్స్ 1200 పాయింట్లకు పైగా నష్టపోగా.. నిఫ్టీ మళ్లీ 24 వేల పాయింట్ల దిగువకు చేరింది.