TG: నార్సింగి పుప్పాలగూడ జంట హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. అక్రమ సంబంధం కారణంగా దారుణంగానే హత్య చేసినట్లు తేలింది. అంకిత్ సాకేత్‌కు వివాహిత బిందు మధ్య కొంత కాలంగా అక్రమ సంబంధం కొనసాగుతోంది. ఈ నెల 11న బిందును నానక్ రామ్ గూడకు పిలిపించి తన స్నేహితుడి రూమ్‌లో ఉంచాడు. తర్వాత ఇద్దరు కలిసి పుప్పాలగూడ గుట్టల వద్దకు వెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే, సాకేత్‌కు తెలియకుండా మరో యువకుడితో బిందు ప్రేమాయణం సాగించింది. మరో ప్రియుడు.. వీరిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ క్రమంలో దాడి చేసి బండరాళ్లతో బాది హత్య చేసినట్లు తెలుస్తోంది.