కట్టుదిట్టమైన భద్రత నడుమ ‘బిగ్‌ బాస్‌’ షూటింగ్

85చూసినవారు
కట్టుదిట్టమైన భద్రత నడుమ ‘బిగ్‌ బాస్‌’ షూటింగ్
ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ ప్రస్తుతం హిందీలో 18వ సీజన్ టెలికాస్ట్ అవుతోంది. ఈ షోకు నటుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. సల్మాన్‌కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి వరుస బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆయన ఇవాళ బిగ్ బాస్ షూట్‌లో పాల్గొననున్నారు. సెట్‌లో దాదాపు 60 మంది సిబ్బంది ఉండనున్నారు. వేరే వారికి ప్రవేశం లేదని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్