చీకటిలో ఆవును ఢీకొట్టి బైక్ బోల్తా.. యువకుడు స్పాట్ డెడ్ (వీడియో)

83చూసినవారు
గుజరాత్‌లోని గాంధీనగర్ దేహ్గామ్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఊహించని ప్రమాదం జరిగింది. స్థానికంగా రోడ్లపై వీధి దీపాలు కొన్నాళ్లుగా వెలగడం లేదు. దీంతో రోడ్డుపై పడుకున్న ఆవును చీకటిలో ప్రయాణిస్తూ ఓ బైకర్ ఢీకొట్టాడు. వెంటనే బైక్ బోల్తా పడింది. బైక్ నడుపుతున్న యువకుడు కింద పడడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. సంఘటనా స్థలంలోనే ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్