బస్సు డ్రైవర్ పై బైకర్ దాడి.. వీడియో వైరల్

55చూసినవారు
కర్ణాటకలో ఓ బైకర్ బస్సు డ్రైవర్ పై దాడి చేశాడు. రాయచూరు జిల్లాలోని సింధనూరులో ఈ ఘటన జరిగింది. బైక్‌ను ఓవర్‌టేక్ చేసినందుకు KSRTC డ్రైవర్ పై మద్యం మత్తులో బైకర్ దాడి చేసినట్లు సమాచారం. నడి రోడ్డుపై ఇద్దరు చొక్కాలు పట్టుకొని.. చెప్పులతో కొట్టుకున్నారు. రోడ్డుపై గొడవ జరగడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో స్పష్టత లేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్