కాలిఫోర్నియాలో బర్డ్‌ ఫ్లూ కలకలం

59చూసినవారు
కాలిఫోర్నియాలో బర్డ్‌ ఫ్లూ కలకలం
అమెరికాలోని కాలిఫోర్నియాను బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా అనే ఈ వ్యాధి అక్కడి పక్షుల్లో వేగంగా విస్తరిస్తోంది. ఫలితంగా, కాలిఫోర్నియా పౌల్ట్రీ పరిశ్రమ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించింది. అడవి పక్షులకు ఈ వ్యాధి సోకడంతో అవి ఆకాశంలో ఎగురుతూ హఠాత్తుగా కూలిపోతున్నాయి. ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి పక్షులను మాత్రమే ప్రభావితం చేస్తుందా లేదా మనుషుల మీద కూడా ప్రభావితం చేస్తుందా అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్