బ్రిటన్ యువరాణి, కింగ్ ఛార్లెస్-3 సోదరి అనే (73) తలకు బలమైన గాయం తగిలి ఆస్పత్రి పాలయ్యారు. ఈ మేరకు బకింగ్‌హామ్ ప్యాలెస్ ఓ ప్రకటనలో తెలిపింది. త్వరలోనే ఆమె పూర్తిగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేసింది. బ్రిస్టల్‌లోని గాట్‌కాంబ్ పార్క్ ఎస్టేట్‌లో ఓ గుర్రం కారణంగా ఆమె తలకు దెబ్బ తగిలినట్లుగా భావిస్తున్నారు. దీంతో వెంటనే ఆమెను స్థానిక సౌత్‌మేడ్ ఆస్పత్రిలో చేర్చారు.