భారీ బడ్జెట్‌తో బుచ్చిబాబు, రామ్‌చరణ్ మూవీ?

1520చూసినవారు
భారీ బడ్జెట్‌తో బుచ్చిబాబు, రామ్‌చరణ్ మూవీ?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే, ఈ మూవీ పూర్తి అవ్వగానే రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఈ సినిమాను ఏకంగా రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారట. పైగా ఈ సినిమాలో చాలామంది పాన్ ఇండియా స్టార్లు కూడా ఉంటారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

సంబంధిత పోస్ట్