TG: భారతదేశ రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక బాధ్యత అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. భారత రాజ్యాంగ పరిరక్షకుడిగా రాహుల్ గాంధీకి దేశ ప్రజల మద్దతు ఉందన్నారు. బీజేపీ 2029లో దేశంలో పూర్తిస్థాయి అధికారంలోకి రావడం కోసం రాజకీలయ కుట్రలు చేస్తుందని విమర్శించారు. ఏపీలో పవన్‌ను అడ్డం పెట్టుకుని ఆధిపత్యం చలాయించాలని బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు.