ప్రియాంక గాంధీపై బీజేపీ నేత వ్యాఖ్యలు దారుణం: భట్టి

77చూసినవారు
ప్రియాంక గాంధీపై బీజేపీ నేత వ్యాఖ్యలు దారుణం: భట్టి
ప్రియాంక గాంధీపై బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బీజేపీ నాయకత్వం ఈ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ సిగ్గుపడాలన్నారు. భారతీయ సంస్కృతిపై బీజేపీ నేతల దాడిగా గుర్తించాలని చెప్పారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీని ఉద్దేశిస్తూ బీజేపీ నేత రమేష్ బిధూరీ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్