బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న అరెస్టు

81చూసినవారు
బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న అరెస్టు
కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నను శనివారం కోలార్‌లో పోలీసులు అరెస్టు చేశారు. తనను చంపేస్తానని ఆయన బెదిరిస్తున్నట్లు కాంట్రాక్టర్ చెల్వరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై కులదూషణకు పాల్పడ్డారని మరో కేసు సైతం ఆయన పెట్టారు. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్‌ను ఫిర్యాదుదారుడు విడుదల చేశారు. దీంతో ఎమ్మెల్యేతో సహా ఆయన పీఏ వీజీ కుమార్, సెక్యూరిటీ ఆఫీసర్ అభిషేక్, వసంత కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్