బ్లాక్‌బస్టర్ మూవీ 'ప్రేమలు'కు భలే క్రేజ్

69చూసినవారు
బ్లాక్‌బస్టర్ మూవీ 'ప్రేమలు'కు భలే క్రేజ్
మలయాళీ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన సినిమా 'ప్రేమలు'. కేవలం రూ.6 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ.130 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. తెలుగులోనూ రిలీజ్‌ అయి మంచి కలెక్షన్స్‌ పొందింది. ఇక ఇప్పుడు ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ మూవీ ఏప్రిల్ 11 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రేమలు సినిమా గురించే చర్చ నడుస్తోంది.

సంబంధిత పోస్ట్