ఏటా రెండుసార్లు బోర్డు పరీక్షలు: ధర్మేంద్ర ప్రధాన్

564చూసినవారు
ఏటా రెండుసార్లు బోర్డు పరీక్షలు: ధర్మేంద్ర ప్రధాన్
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ప్రకటన చేశారు. 10, 12వ తరగతులు విద్యార్థులు ఏటా రెండు సార్లు బోర్డు పరీక్షలకు హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇది అమలవుతుందన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో పీఎంశ్రీ పథకం ప్రారంభించిన తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారు. రెండు సార్లు పరీక్షలు రాసిన విద్యార్థులు, తమకు వచ్చిన మెరుగైన స్కోరును ఎంచుకునే సౌలభ్యం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్