ఇజ్రాయెల్ సైన్యం సెంట్రల్ గాజాలోని పాఠశాలపైనా బాంబులు వేసి , క్షిపణులను ప్రయోగించింది. నుసైరత్ శరణార్థుల శిబిరంలో తాత్కాలిక ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాలపై ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ఐక్యరాజ్యసమితి ఉద్యోగులు సహా 18 మంది మృతి చెందారు. రెండో రోజూ ఇజ్రాయెల్ సైన్యం సురక్షిత ప్రాంతాలపై బాంబులతో దాడి చేసింది. సమాచారం అందుకున్న సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.