దొంగతనం నెపంతో బాలుడిని చితకబాదారు (వీడియో)

1915చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్‌గఢ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. దొంగతనం నెపంతో ఓ బాలుడిని చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటన వినాయక చవితి పండుగ సమయంలో జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఓ మండపంలో దొంగతనం చేశాడనే అనుమానంతో బాలుడిని కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టారు. అయితే తనని కొట్టొద్దని బాధితుడు వేడుకోవడం వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో వైరల్ అయింది. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్