చిన్నపిల్లలను తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఒక్కోసారి వారు ఆడుకుంటూ ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. ఇదే కోవలో గుజరాత్‌లోని జునాగఢ్‌లో సోమవారం అనూహ్య ప్రమాదం జరిగింది. రెండేళ్ల బాలుడు ఆడుకుంటూ బాల్కనీ నుంచి కిందికి పడిపోయాడు. తలకిందులుగా పడడంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. తొలుత ఆ బాలుడిని జునాగఢ్‌లో ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం రాజ్‌కోట్‌కు తరలించారు.