దర్శకధీరుడు ‘ఆర్ఆర్ఆర్’పై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా ప్రశంసలు కురిపించారు. తనకెంతో నచ్చిన భారతీయ చిత్రం ఇదేనని ఆయన అన్నారు. సినిమా అద్భుతంగా ఉందని చిత్ర బృందాన్ని మెచ్చుకున్నారు. ‘ఈ సినిమా చూసిన తర్వాత తెలిసిన వారందరినీ మీరు
ఆర్ఆర్ఆర్ వీక్షించారా? అని మొదట అడిగా. నేను ఈ చిత్రాన్ని చాలా ఎంజాయ్ చేశా. దర్శకుడు, నటీనటులకు అభినందనలు.‘ అని తెలిపారు.