కూతురు క్లీంకారతో ఉపాసన.. వీడియో వైరల్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనల ముద్దుల కూతురు, గారాల పట్టి క్లీంకారకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తల్లి చేతులు పట్టుకొని క్లీంకార బుడి బుడి అడుగులు వేయడం మనం చూడొచ్చు. ఈ వీడియో చూసి మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. చరణ్-ఉపాసన దంపతులకు గత ఏడాది జూన్ 20న క్లీంకార జన్మించింది. కూతురి ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్త పడినా నెట్టింట ప్రత్యక్షమవడం గమనార్హం.