జీవాంజి దీప్తికి కాంస్య పతకం.. హర్షం వ్యక్తం చేసిన తల్లితండ్రులు

75చూసినవారు
జీవాంజి దీప్తికి కాంస్య పతకం.. హర్షం వ్యక్తం చేసిన తల్లితండ్రులు
పారాలింపిక్స్ లో వరంగల్ జిల్లాకు చెందిన జీవాంజి దీప్తి కాంస్య పతకం సాధించడం పట్ల ఆమె తల్లితండ్రుల హర్షం వ్యక్తం చేశారు. తమ కూతురిని ఆరోజు హేళన చేసిన వారే ఈరోజు అభినందిస్తున్నారన్నారు. పేదరికంలో పుట్టి ఎన్నో కష్టాలు అనుభవించి కూతురు పతకం తెచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. మహిళల 400 మీటర్ల టీ-20లో జీవాంజి దీప్తి బ్రాంజ్ మెడల్ సాధించారు. పారాలింపిక్స్ లో మెడల్ సాధించిన తెలంగాణ తొలి యువతిగా జీవాంజి దీప్తి రికార్డుకెక్కారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్