ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్

85చూసినవారు
ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్
తెలంగాణలో సంచలనం రేపుతోన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. లోక్ సభ ఎన్నికల వేళ ఈ కేసులో ఉద్దేశపూర్వంగా బీఆర్ఎస్ పార్టీపై అసత్య ప్రచారం చేస్తున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే దీనిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని, అందుకే హైకోర్టును ఆశ్రయించామని పిటిషన్ లో పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్