వికారాబాద్ జిల్లా దామగుండం నేవీ రాడార్ స్టేషన్ శంకుస్థాపన సభలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై BRS, BJP శ్రేణులు ట్రోల్స్ చేస్తున్నాయి. ఆయన ప్రసంగంలోని రాష్ట్రం, HYDకి మూడు వైపులా సముద్రం ఉందనే వ్యాఖ్యల వీడియోను షేర్ చేస్తూ సెటైర్లు వేస్తున్నాయి. హైదరాబాద్ కు సముద్రం ఎప్పుడొచ్చిందంటూ సెటైర్లు వేస్తున్నాయి. అయితే, సముద్ర మట్టానికి తెలంగాణ మూడువైపులా సరైన ఎత్తులో ఉందని చెప్పడమే ఆయన ఉద్దేశమని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.