తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శాసనమండి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. క్వింటాల్ పసుపునకు రూ.15 వేలు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రం పసుపు బోర్డు ప్రకటించినా చట్టబద్ధత లేదని ఎమ్మెల్సీ మధుసూదనా చారీ గుర్తు చేశారు. వెంటనే చట్ట బద్ధత కల్పించాలని కోరారు.