AP: హోలీ పండుగ రోజు కాకినాడలో కన్నతండ్రే పిల్లల్ని కడతేర్చిన సంగతి తెలిసిందే. చంద్రకిశోర్ తమ పిల్లలు సరిగా చదవడం లేదంటూ వారిని ఇటీవలే వేరే పాఠశాలలో చేర్పించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో తన పిల్లలు పోటీ పడలేక పోతున్నారని, వారికి భవిష్యత్తు లేదని, అందుకే ఇద్దరు పిల్లలను చంపి తాను కూడా చనిపోతున్నానని చంద్రకిశోర్ సూసైడ్ నోటులో రాసినట్లు పోలీసులు తెలిపారు. ఆ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.