బీహార్‌లో పూజారి దారుణహత్య..

553చూసినవారు
బీహార్‌లో పూజారి దారుణహత్య..
బీహార్‌లో పూజారి దారుణహత్య కలకలం రేపింది. ఆరు రోజుల క్రితం కిడ్నాప్ అయిన మనోజ్ కుమార్ అనే పూజారిని అత్యంత పాశవికంగా హత్య చేశారు. కళ్లను పొడిచి, జననాంగాలను కోసేసిన స్థితితో మృతదేహం లభించింది. పోలీసులు అతడి ఆచూకీ కోసం ప్రయత్నించిన దొరకలేదు. కాగా శనివారం గ్రామంలోని పొదల్లో బాధితుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడు బీజేపీ మాజీ డివిజనల్ అధ్యక్షుడి సోదరుడు కావడంతో రాజకీయంగా చర్చనీయాంశం అయ్యింది.

సంబంధిత పోస్ట్