ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన BSNL ప్రైవేట్ కంపెనీలకు నిద్రలేకుండా చేస్తుంది. ఎందుకంటే బడా కంపెనీలకు పోటీగా బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్ల ధరలను ప్రకటిస్తోంది. తాజాగా BSNL 90 రోజుల వాలిడిటీ ప్లాన్ను ప్రకటించింది. ఈ ప్లాన్లో 201 రూపాయలకే దాదాపు 3 నెలల వాలిడిటీని పొందుతారు. 300 నిమిషాల వాయిస్ కాల్స్, 99 SMSలు, 6జీబీ డేటాను అందిస్తోంది. అయితే ఇంటర్నెట్ ఉపయోగించని వారికి ఈ ప్లాన్ సరిపోతుంది.