మరో రెండు రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు పొడిగింపు..?

70చూసినవారు
మరో రెండు రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు పొడిగింపు..?
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరో రెండు రోజులు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 13 వరకు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. అయితే రేపు మేడిగడ్డ ప్రాజెక్టుపై అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. మంగళవారం మేడిగడ్డ పర్యటనకు సీఎం రేవంత్ తో పాటు ఎమ్మెల్యేలు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో సమావేశాలను 14,15 తేదీల్లోనూ నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్