మన జాతీయ గీతం వినిపించలేకపోయా.. బాధగా ఉంది: నీరజ్ చోప్రా

556చూసినవారు
మన జాతీయ గీతం వినిపించలేకపోయా.. బాధగా ఉంది: నీరజ్ చోప్రా
‘‘దేశానికి పతకం వచ్చినందుకు సంతోషంగా ఉంది. అయితే, నా ప్రదర్శనను ఇంకాస్త మెరుగుపర్చుకోవాల్సి ఉంది. పారిస్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు చాలా అద్భుత ప్రదర్శన చేశారు. జావెలిన్‌ త్రో ఈవెంట్‌లో చాలా పోటీ ఉంది. ప్రతి అథ్లెట్‌ తనదైన రోజున సత్తా చాటుతాడు. ఇది అర్షద్‌ డే. నేను మాత్రం వందశాతం కష్టపడ్డా. మన జాతీయ గీతం వినిపించలేకపోయినందుకు బాధగా ఉంది. తప్పకుండా భవిష్యత్తులో మరోసారి సాధిస్తాననే నమ్మకం ఉంది’’ అని నీరజ్ వ్యాఖ్యానించాడు.

సంబంధిత పోస్ట్