ఒంటెను ఢీకొట్టిన కారు (షాకింగ్ వీడియో)

56చూసినవారు
రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లా నోహర్ ప్రాంతంలోని భుకార్కా రోడ్డు సమీపంలో రాత్రి 8.15 గంటల ప్రాంతంలో కారు ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తున్న కారు ఒంటె వెనుక భాగాన్ని ఢీకొట్టింది. దీంతో గాయపడిన ఒంటె కారుపై ఎక్కింది. ఒంటె కారులో ఇరుక్కుపోయి దాని విండ్ షీల్డ్ (ముందు అద్దం) పగిలిపోయింది. కొంతసేపటి తర్వాత గ్రామస్థుల సాయంతో ఒంటెను బయటకు తీశారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్