ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వవద్దని కోర్టును సీబీఐ కోరింది. ఈ మేరకు సీబీఐ వేసిన పిటిషన్‌పై బుధవారం వాదనలు జరిగాయి. సెప్టెంబర్‌లో యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ పిటిషన్ దాఖలు చేయగా, జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. ఇక, ఇరువురి పిటిషన్‌లపై వాదనలు ముగియగా ఈనెల 27కు నిర్ణయాన్ని వాయిదా వేశారు.