నక్షత్ర మండలాల సముదాయం చుట్టూ ఏర్పడే కాంతి వలయాన్ని ఐన్‌స్టీన్ రింగ్ అంటారు. అయితే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన యూక్లిడ్ అంతరిక్ష టెలిస్కోప్, ఎన్‌జీసీ 6505 అనే నక్షత్ర మండలం (గెలాక్సీ) చుట్టున్న ఐన్‌స్టీన్ రింగ్‌ను కనుక్కుంది. ఎన్‌జీసీ 6505 చుట్టూరా ఆవిష్కృతమైన ఇలాంటి మరిన్ని వలయాలను గుర్తించగలిగితే విశ్వం పుట్టుక, నక్షత్ర మండలాల ఆవిర్భావ రహస్యాలు బయటపడే అవకాశముంది.