NZ ఆటగాడు చాద్ బౌస్ వైట్ బాల్ క్రికెట్లో చరిత్ర సృష్టించారు. ఫోర్డ్ ట్రోఫీ (లిస్ట్-ఏ)లో 103 బంతుల్లోనే ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేశారు. కాంటర్బ్యూరీ తరపున బరిలోకి దిగిన బౌస్ 7 సిక్సర్లు, 27 ఫోర్లతో ఒటాగోపై విరుచుకుపడ్డారు. లిస్ట్-ఏలో గతంలో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ నారాయణ్ జగదీశన్ (IND), హెడ్(AUS) పేరిట ఉండేది. వీరిద్దరూ 114 బంతుల్లో ఆ ఘనత సాధించారు.