రాజీనామా పై స్పందించిన చంపై

77చూసినవారు
రాజీనామా పై స్పందించిన చంపై
జార్ఖండ్ సీఎం పదవికి చంపై సోరెన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై చంపై స్పందించారు. “కొన్ని రోజుల క్రితం నేను సీఎం అయ్యాను. రాష్ట్ర బాధ్యత నాపై పడింది. అయితే.. హేమంత్ సోరెన్ తిరిగి వచ్చిన తర్వాత ఆయనే మా నాయకుడు కావాలని కూటమి నిర్ణయం తీసుకుంది. వారి నిర్ణయం మేరకే నేను నా సీఎం పదవికి రాజీనామా చేశా” అని చెప్పుకొచ్చారు.

సంబంధిత పోస్ట్