చంద్రబాబుకు పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టే ధైర్యం లేదు: జగన్

76చూసినవారు
చంద్రబాబుకు పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టే ధైర్యం లేదు: జగన్
ఏపీలో రెగ్యులర్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టే ధైర్యం కూడా సీఎం చంద్రబాబుకు లేదని ఎస్ జగన్ విమర్శించారు. కనీసం 7 నెలల కోసం కూడా పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టడం లేదు. ఎందుకంటే, పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడితే, తాను ఎన్నికల ముందు ప్రకటించిన మోసపూరిత హామీలకు కేటాయింపులు చూపాలి. కానీ, అలా చూపే పరిస్థితి చంద్రబాబుకు లేదు. ఎందుకంటే, ఆ పథకాలు చిత్తశుద్ధితో అమలు చేసే అలవాటు అయనకు లేదని జగన్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్