TG: భద్రాచలంలో ఉద్రిక్తత నెలకొంది. బుధవారం మధ్యాహ్నం ప్రమాదం జరిగితే ఇంత వరకు శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసుకురాలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవనం శిథిలాల కింద మరో వ్యక్తి ఉపేందర్ ఉన్నారు. రెస్క్యూ సిబ్బంది ఇంకా సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సహాయక చర్యలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు బయటకు తీస్తారన్నది కూడా అధికారులు చెప్పడం లేదని మండిపడుతున్నారు.