విషాదం.. చెరువులో మునిగి విద్యార్థి మృతి

74చూసినవారు
విషాదం.. చెరువులో మునిగి విద్యార్థి మృతి
AP: గుంటూరు జిల్లాలోని వట్టిచెరుకూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. చెరువులో మునిగి బీసీ వసతి గృహ విద్యార్థి మృతిచెందాడు. హాస్టల్‌లో నీటి సౌకర్యం లేకపోవడంతో ముగ్గురు విద్యార్థులు సమీపంలో ఉన్న చెరువులో స్నానానికి దిగారు. వారిలో ఇద్దరు వెనక్కి రాగా.. మరో విద్యార్థి బిక్కం కిశోర్‌ నీట మునిగాడు. స్థానికులు స్పందించి కాపాడే లోపు విద్యార్థి మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్