చంద్రయాన్-3 ప్రయోగం రీ షెడ్యూల్

868చూసినవారు
చంద్రయాన్-3 ప్రయోగం రీ షెడ్యూల్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రయాన్-3 ప్రయోగానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రయోగానికి సంబంధించి షెడ్యూల్‌లో మార్పు చేసినట్టు తాజాగా ఇస్రో ప్రకటించింది. తొలుత ఈ నెల 13న ఈ ప్రయోగం జరగాలని నిర్ణయించినా. కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రయోగం ఒక రోజు ఆలస్యంగా జరగనుంది. దీంతో జూలై 14 మధ్యాహ్నం 2.35 గంటలకు శ్రీహారికోటలోని డాక్టర్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం చేపట్టనున్నారు.

సంబంధిత పోస్ట్