ముగ్గు కోసం జరిగిన గొడవలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. ఛత్రినాక పరిధిలోని శివాజీనగర్‌లో మాణిక్ ప్రభు అనే వ్యక్తి తల్లి ఇంటి ముందు ముగ్గు వేసింది. పక్కింటి వారు నీళ్లు పోయడంతో ముగ్గు కొట్టుకుపోయింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. పక్కింటి దుర్గేష్, మాణిక్ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో మాణిక్ కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించే క్రమంలో చనిపోయాడు.