ఘోర రోడ్డు ప్రమాదం. 27 మంది మృతి(వీడియో)

19737చూసినవారు
మెక్సికోలోని ఓక్సాకా సమీపంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో 27 మంది మృతిచెందారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం దృశ్యాలు బస్సులోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

సంబంధిత పోస్ట్