సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అనే దొంగ రూ.30 వేలు దొంగిలించేందుకు సైఫ్ ఇంట్లోకి చొరబడినట్లు పోలీసులు వెల్లడించారు. నకిలీ ఆధార్, పాన్ కార్డులు పొందేందుకు దుండగుడు యత్నించినట్లు పేర్కొన్నారు. బంగ్లాదేశీయుడైన నిందితుడు అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి, విజయ్ దాస్‌గా పేరు మార్చుకున్నాడు.