సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా చంద్రబాబు మరో కీలక హామీని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ ఏడాది మే నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని ఇటీవల ప్రకటించడంతో విధివిధానాలను రూపొందించడంలో అధికారులు నిమగ్నం అయ్యారు. ఈ క్రమంలో పథకం ద్వారా లబ్ధి పొందే విద్యార్థులకు 75 శాతం అటెండెన్స్ తప్పనిసరి చేసినట్లు సమాచారం. ఈనెల 15న ఏపీ కేబినెట్ భేటీ కానుండగా అప్పుడు దీనిపై క్లారీటీ రానున్నట్లు సమాచారం.