వాముతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎసిడిటీతో బాధపడేవారు ఒక గ్లాసు నీటిలో వాము, జీలకర్ర వేసి మరిగించి.. ఆ మిశ్రమాన్ని తాగాలి. వాము నీటిని తాగడం వల్ల గర్భిణీలకు మలబద్ధకం, అజీర్ణ సమస్యలు తగ్గుతాయి. బాలింతల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. రోజూ పరగడుపున తాగితే గుండె సంబంధిత వ్యాధులు దూరమవుతాయి. దగ్గు, ఆర్థరైటిస్ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. వేయించిన వాము పాలలో కలిపి తాగితే నెలసరి నొప్పి తగ్గుతుంది.