కోడి కోసం గోడపైకి దూకిన చిరుత.. చివరికి (వీడియో)

64చూసినవారు
ఇటీవల క్రూర మృగాలు గ్రామాల్లోకి వచ్చి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో జరిగింది. మే 29న సోమయనూర్ గ్రామంలో చిరుత సంచరించింది. ఈ క్రమంలో ఒక ఇంటి గోడపై ఉన్న కోడిని అది చూసింది. దానిని వేటాడేందుకు చిరుత ఆ ఎత్తైన గోడపైకి దూకింది. కోడి భయంతో మరోవైపు దూకగా.. చిరుత క్షణాల్లో దానిని వెంబడించి నోటకరుచుకుని వెళ్లిపోయింది. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో నెట్టింట వైరలయ్యింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్