చంద్రన్న బీమా అమలుకు ఏడాదికి రూ.2,800 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. గత మూడేళ్లలో దాఖలైన క్లెయిమ్‌ల ఆధారంగా రాష్ట్రంలో రాబోయే రోజుల్లో బీపీఎల్ కుటుంబాల్లో ప్రమాదవశాత్తు మరణించే వారి సంఖ్య 13 వేలు, సహజ మరణాలు 39 వేలు ఉండొచ్చని అంచనా వేశారు. వైఎస్సార్ బీమాలో కుటుంబంలో సంపాదనపరులైన వారికే బీమా వర్తించేది. చంద్రన్న బీమాలో అలాంటి నిబంధనలు పెట్టడం లేదు.