చైనాలో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన హోటల్ నిర్వహిస్తున్న ఓ వ్యాపారి చైనీస్‌కు సంబంధించిన పాటలు వినకుండా.. ఇండియాకు చెందిన హిందీ పాటలను వింటున్నాడు. బాలీవుడ్ చిత్రానికి సంబంధించిన 'కాష్ కోయి బాయ్' అనే పాటను వింటూ పని చేసుకుంటున్నాడు. ఇదంతా అక్కడ ఉన్న తెలుగువారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్తా వైరలవుతోంది.