ఏ గుడిలో చూసినా మనకు గంట కనబడుతుంది. గుడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ గంట కొడతారు. చిన్న పిల్లలతో సైతం గంట మోగిస్తుంటారు. అయితే గంట ఎందుకు కొడతారో ఎప్పుడైన ఆలోచించారా? హిందూ మత విశ్వాసాల ప్రకారం గంట కొడితే ఆ శబ్దంతో శరీరంలోని అన్ని రకాల ప్రతి కూల శక్తులు తొలగిపోతాయని హిందూ మత పెద్దలు చెబుతుంటారు. అంతే కాకుండా గంట మోగించడం వల్ల ఏకాగ్రత పెరిగి దేవుడి మీద నమ్మకం కలిగేలా మనసు సహకరిస్తుందట.