మహారాష్ట్రలోని తాడోబా-అంధేరి టైగర్ రిజర్వ్ ఫారెస్టులో నివసించే ఓ ఎలుగుబంటి తన పిల్లలతో తిరుగుతుండగా అదే సమయంలో ఒక్కసారిగా పులి.. ఎలుగు కూనపై దాడి చేసింది. దీంతో ఎలుగుబంటి తన పిల్లను కాపాడుకోవడానికి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పులిని బెదిరిండమే కాక పరుగులు పెట్టించింది. ఆ విరోచిత పోరాటానికి పులి తోక ముడిచి పారిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.